గ్రేట్ : టీ20ల్లో సూర్య టాప్‌ స్కోరర్

ఈ ఏడాది మిస్టర్ 360 సూర్య కుమార్ యాదవ్ ఖాతాలో రికార్డ్ చేరింది. టీ20 ఫార్మాట్‌లో ప్రస్తుత క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సూర్య రికార్డ్ కొట్టాడు. ఇప్పటి వరకు ఇదే స్థానంలో ఉన్న పాక్‌ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్‌ను దాటేశాడు. ఇప్పటి వరకు మహమ్మద్‌ రిజ్వాన్‌ 20 ఇన్నింగ్స్‌ల్లో 839 పరుగులు చేశాడు. తాజాగా సూర్యకుమార్‌ 25 ఇన్నింగ్స్‌ల్లో 867 పరుగులతో టాపర్‌గా నిలిచాడు.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాక్ తో జరిగిన తొలి మ్యాచ్ లో సూర్య 15 పరుగులకే అవుట్ కాగా.. నెదర్లాండ్స్‌పై కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం బాదిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఐసీసీ (25వ తేదీ వరకు అప్‌డేట్‌) టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లోనూ రిజ్వాన్‌ తొలిస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్‌ ప్లేయర్ డేవన్ కాన్వే రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా నెదర్లాండ్స్‌పై హాఫ్‌ సెంచరీ ప్రదర్శనను ఇంకా పరిగణనలోకి తీసుకోలేదు. వచ్చేవారం ప్రకటించే ర్యాంకింగ్స్‌లో భారీగా మార్పులు ఉండే అవకాశం ఉంది.