అసెంబ్లీకి వెళ్లనున్న ఎన్టీఆర్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని.. టీడీపీ పగ్గాలు చేపట్టి.. ఏపీ సీఎం కావాలన్నది ఆయన అభిమానుల బలమైన కోరిక. వారి కోరికను తారక్ భవిష్యత్  లో తీర్చే అవకాశం లేకపోలేదు. అయితే అంతకంటే ముందే.. ఎన్ టీఆర్ అసెంబ్లీ కి వెళ్తున్నారు. అయితే అది తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ అసెంబ్లీకి కాదు. కర్ణాటక అసెంబ్లీకి వెళ్లనున్నారు.

నవంబర్‌ 1న కర్ణాటక అసెంబ్లీలో జరగనున్న ‘కన్నడ రాజ్యోత్సవ’ వేడుకల్లో తారక్ పాల్గొననున్నారు. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై నుండి తారక్ కు ఆహ్వానం అందింది. ఈ వేడుకల్లో భాగంగా కన్నడ స్టార్‌, దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌కు కర్ణాటకలో విశిష్ఠ పురస్కారంగా భావించే ‘కర్ణాటక రత్న’ అవార్డు ఇవ్వనున్నారు.

ఈ అవార్డు అందుకున్న తొమ్మిదోవ వ్యక్తిగా పునీత్‌ పేరు సొంతం చేసుకున్నారు. తెలుగులోనే కాకుండా కర్ణాటకలోనూ ఎన్టీఆర్‌కు ఉన్న విశేష ఆదరణ, పునీత్‌తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆహ్వానం పంపించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి తారక్‌తోపాటు రజనీకాంత్‌, జ్ఞానపీఠ్అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్, పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబానికి కూడా ఆహ్వానాలు అందాయి.