రిషబ్‌కు సూపర్ స్టార్ సన్మానం

‘కాంతార’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొంటారు రిషబ్ శెట్టి. భూతకోల సంప్రదాయాన్ని ఆధారంగా చేసుకుని ‘కాంతార’ చిత్రాన్ని రూపొందించారు. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ప్రకృతికి, మానవాళికి మధ్య సత్సంబంధాలుండాలని ఈ సినిమాతో తెలియజేశారు. విడుదలైన అన్ని బాషల్లో ఘన విజయం సాధించింది. విమర్శకు ప్రశంశలు అందుకుంది. ఈ క్రమంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రిషబ్ శెట్టిని సన్మానించారు.

రజనీ ఆహ్వానం మేరకు శుక్రవారం రిషబ్‌ ఆయన నివాసానికి వెళ్లారు. ‘కాంతార’ తనకెంతో నచ్చిందని పేర్కొన్న రజనీ.. రిషబ్‌కు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం వీరిద్దరూ ఈ సినిమా విశేషాలపై ముచ్చటించుకున్నారు. సూపర్‌స్టార్‌ ప్రశంసలు పొందడంపై రిషబ్‌ ఆనందం వ్యక్తం చేస్తూ ట్విటర్‌ వేదికగా తాజాగా ఫొటోలు షేర్‌ చేశారు. ఇది తనకెంతో ప్రత్యేకమని చెప్పారు.