జీవిత సత్యం చెప్పిన పూరి

పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ అట్టర్ ప్లాప్ తో పూరి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఇక ఆయన పనైపోయిందని మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో పూరి జీవిత సత్యం చెప్పాదు.
జీవితాన్ని ఒక సినిమాలా చూడాలని, అది విజయం సాధిస్తే డబ్బు వస్తుందని, పరాజయం పొందితే బోలెడు జ్ఞానం లభిస్తుందని చెప్పారు. నిజాన్ని నిజమే కాపాడుతుందని, ప్రేక్షకుల పట్ల తాను ఎప్పుడూ బాధ్యతగానే ఉంటానని పేర్కొన్నారు. మళ్లీ ఓ సినిమా చేస్తానని, తప్పకుండా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తానని చెప్పారు.