గంట సేపు ఆ పని చేశాను !
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన జిన్నా చిత్రంలో సన్నీ లియోన్ నటన ఆకట్టుకుంది. తెలుగు రాని ఈ అమ్మడు మూగ, చెవిటి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. అయితే, ఈ పాత్ర కోసం తను ఎంతగా కష్టపడిందో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది సన్నీ.
‘‘సినిమాలో నా పాత్ర గురించి తెలుసుకోగానే నేను ఒక కోచ్‌ను నియమించుకొని కొన్ని వారాల పాటు సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. దర్శకుడు, రచయితతో మాట్లాడి కథను అర్థం చేసుకున్నాను. సైన్ లాంగ్వేజ్‌కు సంబంధించిన ఎన్నో పుస్తకాలు, వీడియోలు నాకు పంపారు. వాటి వల్ల కళ్లతో హావభావాలు పలికించడం ఎలానో నేర్చుకున్నాను. ప్రతి సన్నివేశానికి షూటింగ్ మొదలవ్వడాని కంటే ముందు గంటసేపు రిహార్సిల్స్ చేశానని చెప్పుకొచ్చారు.