కింగ్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్

కింగ్ కోహ్లీ సూపర్ ఫాల్ లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ జరిగిన మ్యాచ్ లో 82 పరుగులు చేసిన కోహ్లీ, నెదర్లాండ్స్ పై అదరగొట్టాడు. ఇక ఈరోజు సౌతాఫ్రికాతో జరగనున్న మ్యాచ్ లో మరోసారి కోహ్లీ విశ్వరూపం చూపిస్తాడని అభిమానులు ఆశపడుతున్నారు. నేటి మ్యాచ్‌లో పలు రికార్డులపై కన్నేశాడు కింగ్.
టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో కోహ్లీ మొత్తం 989 పరుగులు చేశాడు. ఇంకో 28 పరుగులు చేస్తే ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. శ్రీలంక మాజీ ఆటగాడు మహేలా జయవర్దనే 1016 పరుగులతో ఈ జాబితాలో ముందున్నాడు. మరో 11 పరుగులు చేస్తే .. జయవర్దనే తర్వాత వెయ్యి పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ నిలవనున్నాడు.ఇక విరాట్.. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 23 మ్యాచ్‌లు ఆడి.. 89.9 సగటుతో 989 పరుగులు చేశాడు. ఇందులో 12 అర్ధ శతకాలున్నాయి.