ప్రభాస్ బ్యానర్.. జీఎస్టీ బకాయిలు !

యూవీ క్రియేషన్స్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సొంత బ్యానర్ లాంటిది. అయితే తాజాగా యూవీ క్రియేషన్స్ ఆఫీస్‌లో జీఎస్టీ నిఘా విభాగం సోదాలు నిర్వహించింది. ఆ సంస్థకు వస్తున్న ఆదాయం, చెల్లిస్తున్న జీఎస్టీకి వ్యత్యాసం ఉన్నట్లు ఇటీవల అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ కావూరి హిల్స్‌లోని కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన సోదాల్లో రూ.6 కోట్లకు పైగా జీఎస్టీ బకాయిలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు.