సింగిల్ స్టేటస్‌కు గుడ్‌బై
హీరోయిన్ హన్సిక సింగిల్ స్టేటస్ కు గుడ్ బై చెప్పింది. కాబోయే వాడిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సోహైల్‌ను పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పింది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద అతడితో దిగిన ఫొటోలను షేర్ చేసింది.
‘ఇప్పటికీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అని పేర్కొన్నారు. మోకాలిపై కూర్చొని ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అంటూ హన్సికకు ప్రపోజ్ చేయగా.. అందుకు ఆమె ఓకే చెప్పింది. రాజస్థాన్ జైపూర్‌లోని ఓ రాజకోటలో డిసెంబర్ 4న కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. డిసెంబర్ 2 నుంచి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి.
హన్సిక నటించిన ‘పార్ట్‌నర్’, ‘105 మినట్స్’ చిత్రాల షూటింగ్ పూర్తవగా.. తెలుగులో ‘మై నేమ్ ఈజ్ శృతి’, తమిళంలో నాలుగు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.