మునుగోడులో టీఆర్ఎస్ గెలిచింది. కానీ.. !
ఆఖరి రౌండ్ వరకూ టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా కొనసాగిన మునుగోడు ఉప ఎన్నిక పోరులో గులాబీ పార్టీ గెలిచింది. బీజీపీపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10,309 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు దీన్ని సెమీ ఫైనల్‌గా భావించిన ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు శ్రమించి, సర్వశక్తుల్ని ధారపోశాయి. దేశ రాజకీయాల్లోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్న ఈ ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకొని తమ సత్తా చాటాలని భాజపా తీవ్ర ప్రయత్నాలు చేయగా.. సీఎం కేసీఆర్ తన వ్యూహాలతో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేశారు.
అయితే ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు. ఇందులో ఒకటి డబ్బుల పంపకం.. తెల్లారితే ఓటింగ్ అనగా.. టీఆర్ ఎస్,బీజేపీ రెండు డబ్బలు పంచాయని ఓటర్లు చెబుతున్నారు. అయితే టీఆర్ ఎస్ ఒక్కో ఓటుకు రూ. 5 వేలు ఇవ్వగా.. బీజేపీ ఓటుకు రూ. 4 వేలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పైసా కూడా రాలేదు. ఈ నేపథ్యంలో వెయ్యి తక్కువ పంచిన కమలం పార్టీకి ఒక్కో రౌండ్ లో దాదాపు వెయ్యి ఓట్లు తక్కువగా వచ్చాయని చెబుతున్నారు.
ఇక టీఆర్ ఎస్ గెలుపుకు రెండో కారణం.. ఫాంహౌస్ ఫైల్స్. మొయినాబాద్ ఫాంహౌస్ లో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం… మునుగోడులో కారు పార్టీ గెలుపుకు దోహదపడిందని విశ్లేషకులు చెబుతున్నారు. మునుగోడులో కామ్రెడ్లు సైతం కారు పార్టీతో కలిసి నడవడం అతిపెద్ద ప్లస్ అని చెప్పవచ్చు. మొత్తానికి.. కేసీఆర్ వ్యూహాల ముందు ఈ సారి కమలం పార్టీ ఎత్తులు పని చేయలేదు.