గంగుల ఇంట్లో ఎంత డబ్బు దొరికింది ?

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేశారు. మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి.

అయితే సోదాలు జరిగే సమయంలో మంత్రి గుంగుల విదేశాల్లో ఉన్నారు. దీంతో ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి.. అధికారులు సోదాలు చేశారు. అయితే సోదాల విషయం తెలిసి.. మంత్రి గంగుల హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. తన ఇంట్లో చేసిన సోదాల్లో ఎంత నగదు దొరికిందో అధికారులు చెప్పాలని గంగుల కమలాకర్డిమాండ్ చేశారు.

“దర్యాప్తు సంపూర్ణంగా చేయండి. నిజాలు నిగ్గుతేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదే. నేను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఈడీ అధికారులు వీడియో కాల్‌ ద్వారా ఫోన్‌ చేసి ఇంటి తాళాలు తీయమని అడిగారు. నేనే ఇంట్లోని ప్రతి లాకర్‌ ఓపెన్‌ చేసి చూసుకొమ్మని చెప్పా. ఈ సోదాల్లో ఎంత నగదు దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో ఈడీ అధికారులు చెప్పాలి” అని గంగుల కోరారు.