పాక్ కు స్ట్రోక్.. ఇంగ్లాండ్ దే టీ20 వరల్డ్ కప్

టీ20 ప్రపంచకప్‌ 2022 విజేతగా ఇంగ్లాండ్ నిలిచింది. ఫైనల్ లో పాక్ ను చిత్తు చేసింది. టాస్ గెలిచి పాక్ మొదటి బ్యాటింగ్ ను అప్పగించిన ఇంగ్లీష్ జట్టు అన్ని రంగాల్లో రాణించి.. పాకిస్తాన్ ను సునాయసంగా ఓడించింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 5 వికెట్లు కోల్పోయి ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే ఛేదించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్‌ స్టోక్స్‌ (52; 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకంలో అదరగొట్టాడు. బట్లర్‌ (26;17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), బ్రూక్‌ (20), మొయిన్‌ అలీ (19; 13 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.