కాంతార’ ఓటీటీ రిలీజ్ మళ్లీ వాయిదా

భాషతో సంబంధం లేకుండా భారతీయ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్న చిత్రం కాంతార. ఓటీటీలో ఎప్పుడు వస్తుంది ?  కనీసం తేదీ అయినా ప్రకటిస్తారా? అని ప్రేక్షకులు అడుగుతున్నారు.  అక్టోబరు 15న తెలుగులో ‘కాంతార’ విడుదలైంది. దాదాపు నెల రోజులు కావొస్తున్నా, ఇప్పటికీ థియేటర్లు మంచి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. తెలుగులోనే కాదు, హిందీలోనూ ఇదే పరిస్థితి.

తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 4న స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తేవాలి. ఆ తర్వాత నవంబరు 18న విడుదల చేస్తారని టాక్‌ నడిచింది. సినిమా విడుదలైన తర్వాత నిర్ణయించుకున్న తేదీకి ఓటీటీలో చేసే అవకాశం ఉన్నా, వరుస కలెక్షన్లతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఇంకాస్త ఆగి, విడుదల చేస్తే, సినిమాకు మంచి క్రేజ్‌ వస్తుందని సదరు ఫ్లాట్‌ఫాం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.