RC15 ఫస్ట్ లుక్ ఎప్పుడంటే ?

ప్ర‌స్తుతం శంక‌ర్‌తో రామ్‌చ‌ర‌ణ్ ఓ పాన్ ఇండియ‌న్ సినిమా (#RC15) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే హిందుస్థాన్ టైమ్స్ లీడ‌ర్‌షిప్ స‌మ్మిట్‌లో ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని అడిగిన ప్ర‌శ్న‌కు రామ్‌చ‌ర‌ణ్ ఆస‌క్తిక‌రంగా స‌మాధానం ఇచ్చాడు.

ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ ఎప్పుడ‌న్న‌ది తనకు తెలియదని అన్నాడు. అదే ప్ర‌శ్నద‌ర్శ‌కుడు శంక‌ర్‌ను తాను అడ‌గాల‌ని అనుకుంటున్నా అంటూ ఫ‌న్నీగా బ‌దులిచ్చాడు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌, టైటిల్ ఎప్పుడు విడుద‌ల చేస్తారోన‌ని అంద‌రితో పాటు నేను ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా. శంక‌ర్‌కు నేను వీరాభిమానిని. 1992 నుంచి ఆయ‌న సినిమాల్ని ఇష్ట‌ప‌డ‌టం మొద‌లుపెట్టా. ఆయ‌న‌తో ప‌నిచేయాల‌నే నా క‌ల ఈ సినిమాతో తీర‌డం ఆనందంగా ఉంద‌ని తెలిపాడు. ఆర్‌సీ 15 సాంగ్ షూట్ కోసం సోమ‌వారం న్యూజిలాండ్ వెళ్ల‌నున్న‌ట్లు రామ్‌చ‌ర‌ణ్ పేర్కొన్నాడు.