హృతిక్‌ కొత్తింటి కాపురం ఖరీదు రూ. 100 కోట్లు ?

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటి సబా ఆజాద్‌తో రిలేషన్‌లో ఉన్నారు. 2014లో హృతిక్ తన భార్య సుజేన్‌ ఖాన్‌ నుంచి విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే సబా ఆజాద్‌తో పరిచయం ఏర్పడింది. బాలీవుడ్‌లో జరిగిన పలు పార్టీలు, డిన్నర్‌ డేట్స్‌కు వీరిద్దరూ కలిసి హాజరు కావడంతో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.

ముంబయిలోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసముంటోన్న వీరిద్దరూ త్వరలో వీరిద్దరూ కొత్త ఇంటిలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రియురాలితో కలిసి ఆహ్లాదకరంగా నివసించేందుకు.. బీచ్‌ వ్యూతో ఉన్న రెండస్తుల భవనాన్ని కొన్నట్లు సమాచారం. దీని ఖరీదు సుమారు రూ.100 కోట్లని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.