ప్రియుడితో ఆమిర్ ఖాన్ కుమార్తె ఎంగేజ్ మెంట్

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆమిర్ కుమార్తె ఐరా ఖాన్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తన ప్రియుడు, ఫిటెనెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో ఐరా ఖాన్ వివాహం జరగనుంది. వీరి నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం ముంబయిలో వేడుకగా జరిగింది. ఆమిర్‌ఖాన్, ఐరా ఖాన్ తల్లి రీనా దత్తా, కిరణ్ రావు, ఫాతిమా సనా షేక్, ఇమ్రాన్ ఖాన్‌తోపాటు ఇతర కుటుంబసభ్యులు ఈ వేడుకల్లో పాల్గొని నూతన జంటను అభినందించారు.

ఆమిర్ ఖాన్‌కు వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉన్న నుపుర్ వద్దే ఐరా సైతం ఫిట్నెస్ పాఠాలు నేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. వీరి బంధం గురించి 2020 నుంచే వార్తలు వస్తున్నప్పటికీ.. ఇటీవల ఓ వీడియోతో తమ ప్రేమను అధికారికంగా ప్రకటించింది ఈ జంట. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరి పెళ్లి ఫిక్సయింది.