NTR30 బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కోసం డిస్కషన్ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు షురూ కానుంది. సినిమా కథేంటీ ? తారక్ ను కొరటాల ఎలా చూపించబోతున్నాడు అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. తాజాగా అనిరుద్ తో కొరటాల చర్చిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కోసం డిస్కషన్ జరుగుతున్నాయని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా కోసం తారక్ సరికొత్త లుక్ లోకి మారిపోయారు. ఆయన కొత్త లుక్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే బయటికొచ్చాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించబోతుందని సమాచారం. మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు కూడా నటించనున్నారని సమాచారం. పాన్ ఇండియా సినిమాగా #NTR30 తెరకెక్కనుంది.