హైదరాబాద్ లో టెన్త్ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్

హైదరాబాద్ నగర శివారు హయత్‌నగర్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలికపై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆగస్ట్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిందితులు అత్యాచారాన్ని వీడియో తీసి తోటి విద్యార్థులకు పంపించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బాలికను బెదిరించారు. అనంతరం 10 రోజుల తర్వాత మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే అప్పటి వీడియోను నిందితులు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం బాధితురాలి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.