తెలంగాణలో ఉద్యోగాల జాతర.. త్వరలో మరో 16 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణలో రాజకీయాల్లో ఎన్నికల మూడ్ కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ ముందుస్తుకే మొగ్గు చూపుస్తున్నారు. డిసెంబర్ లేదా ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అది నిజమే అన్నట్టుగా తెలంగాణ సర్కార్ నిర్ణయాలు కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఇప్పటి వరకు 60వేల పైచిలుకు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా.. మరో 16వేలకు పైగా పోస్టులకు త్వరలోనే అనుమతులు ఇవ్వనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
మంళవారం ఉద్యోగ నియామక ప్రక్రియపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డితో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో 60,929 పోస్టుల భర్తీకి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. మరో 16,940 పోస్టులకు కూడా త్వరలోనే అనుమతులు ఇవ్వనున్నట్టు చెప్పారు .