ఇళ్లు లేని పేదలకు రూ.3 లక్షలు

తెలంగాణ ప్రభుత్వం పేదోడి సొంతింటి కలను తీర్చే పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. సొంత స్థలాలుండి ఇళ్లు లేని నిరుపేదలకు రూ.3 లక్షల పథకాన్ని ప్రభుత్వం డిసెంబరులో ప్రారంభించనుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

ఈలోపు రెండు పడకగదుల ఇళ్లు మంజూరై.. నిర్మాణాలు జరగని గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.5.04 లక్షల పథకం మంజూరు కాని వారిని రూ.3 లక్షల పథకంలో అర్హులుగా గుర్తించాలన్నారు. ఈ రెండు పథకాల్లోని వ్యత్యాసాన్ని ప్రజలకు అర్థమయ్యేలా స్థానిక ప్రజాప్రతినిధులు వివరించాలని చెప్పారు. ఎన్నికల నాటికి ఏ గ్రామంలోనూ ఇళ్లు లేని నిరుపేదలు ఉండకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టంచేశారు.