సంజయ్ డౌటు అనుమానమే నిజమైంది.. పంజాబ్ రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్ లు బౌన్స్ !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ నుంచో.. ఫాంహౌస్ నుంచో బయటకు రావటమే పెద్ద సంచలనం. వేరే సంచలనమేమీ లేదు. పంజాబ్ వెళ్లి చెక్కులిచ్చారు. ఆ చెక్కులు చెల్లుతాయో..? లేదో..? డౌటు అనుమానంగా ఉందని బండి సంజయ్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన అనుమానమే నిజమైంది అని అంటున్నారు.
712 రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల చొప్పున కేసీఆర్ చెక్కులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొందరికి రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినట్టు నేషనల్ వెబ్ సైట్ లో కథనాలు వచ్చాయి. ఇప్పుడీ.. ఈ వార్తలను ఆధారంగా చేసుకొని కేసీఆర్ పై బీజేపీ శ్రేణులు మాటల దాడిగే అవకాశాలు ఉన్నాయి.