నటనతో అదరగొట్టిన గౌతమ్


సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ నటనలో అదరగొట్టేశాడు. తొలిసారి చేసిన స్టేజ్ పర్ఫామెన్స్ లో ఇరగదీశాడు. క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా స్కూల్‌లో జరిగిన థియేటర్‌ ప్రదర్శనలో కథానాయకుడిగా సందడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను నమ్రత ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. 

‘అతడు ప్రేమలో నిపుణుడు కాదు. కానీ, అతడికి ప్రేమలో అనుభవం ఉన్న స్నేహితులు ఉన్నారు. హైస్కూల్‌లో గౌతమ్‌ మొట్టమొదటి థియేటర్‌ ప్రదర్శన ఇది. తన స్టైల్‌తో అదరగొట్టేశాడు. ఫ్రోజెన్‌ ఫ్యామిలీని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. గౌతమ్‌ నాకెంతో గర్వంగా ఉంది. నువ్వు మున్ముందు మరెన్నో ప్రదర్శనలు ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అని నమ్రత రాసుకొచ్చారు.

మహేష్ కూతురు సితార కెమెరా ముందు సందడి చేయడం చూశాం. సితార పాప డ్యాన్స్ వీడియోలు, తండ్రితో కలిసి చేసిన అల్లరి వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. దర్శకుడు వంశీపైడిపల్లి కూతురు తో కలిసి సితార ఓ యూట్యూబ్ ఛానల్ ను కూడా రన్ చేస్తోంది. అయితే గౌతమ్ మాత్రం మంచి కెమెరా ముందుకు రావడం చాలా అరుదు. గౌతమ్ మంచి స్విమ్మర్. ఇప్పటికే పలు అవార్డులు అందుకున్నారు. అయితే తొలిసారి గౌతమ్ స్టేజ్ పై నటించి ఆకట్టుకున్నాడు. సూపర్ మహేష్  నట వారసుడిని అనిపించుకోవడానికి తనకు అన్ని అర్హతులు ఉన్నాయనే సంకేతాలు ఇచ్చారు. 

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)