ఢిల్లీ లిక్కర్ కేసు : మీడియా ముందుకు కవిత ఏం చెప్పబోతున్నారు ?
ఢిల్లీ లిక్కర్ కేసు రిమాండ్ రిపోర్టులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా మరికొంత మంది పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ కేసులో అనుమానం ఉన్న 36 మంది పేర్లను అమిత్ అరోడా రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొంది. ఈ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఆయనను ఈడీ మంగళవారం రాత్రి అరెస్టు చేసింది. బుధవారం దిల్లీ కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా రిమాండ్ రిపోర్టు సమర్పించింది. ఆ నివేదికలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కల్వకుంట్ల కవిత, శరత్‌రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్, సృజన్‌రెడ్డి పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కవిత స్పందించనున్నారు. కాసేపట్లో బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆమె చెబుతారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.