ఎవర్ గ్రీన్ అందాలు
ఎవర్ గ్రీన్ బ్యూటీ కరిష్మా కపూర్ పేరు తెలియని వారు దాదాపుగా ఉండరు. 90 లలో భారీ విజయాలతో బాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన హీరోయిన్ కరిష్మా. హీరోలతో సమానమైన స్టార్ ఇమేజ్.. భారీ రెమ్యూనరేషన్ తో సంచలనం సృష్టించారు.
ఒకప్పుడు ఆమె భారత్ లోనే అందరు నటీమణుల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకునేది. ఆమె ఎక్కువగా కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లో నటించేది. హిందీ సినిమాల నుండి మూస కథానాయిక పాత్రల నుంచి బయటికి రావాలని ఆమె పాత్రలతో చాటి చెప్పింది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు తాజాగా ఆమె తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఇందులో కూల్ కలర్ డ్రెస్ లో ప్రశాంతమైన వాతావరణంలో హ్యాపీ మూడ్ లో కనిపిస్తున్నారు.