తారక్ ట్వీట్.. రాజమౌళి చిన్న కరెక్షన్‌ !

హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ది న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్’ అవార్డును ‘ఆర్ఆర్ఆర్’  చిత్రాన్ని వరించింది. అమెరికాలో తాజాగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. దీంతో జక్కన్నకు అభినందనలు చెబుతూ సినీ ప్రియులు పోస్టులు పెడుతున్నారు.

ఈ జాబితాలో స్టార్ హీరో ఎన్టీఆర్‌ కూడా చేరారు. ‘అభినందనలు జక్కన్న. మీ కీర్తి ప్రపంచవ్యాప్తంకావడానికి ఇది ఆరంభం మాత్రమే. ఇన్నేళ్ల మన జర్నీలో మీ గురించి నాకు తెలిసినదంతా ప్రపంచానికి కూడా తెలియాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ట్వీట్‌ చేశారు. దీనికి రాజమౌళి స్పందిస్తూ, ‘హహ్హహ్హ.. తారక్‌ చిన్న కరెక్షన్‌. ఇది మన ప్రయాణానికి ఆరంభం’ అంటూ రిప్లై ఇవ్వడంతో ఈ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అయింది.