‘ఖాకీ : ది బిహార్‌ చాప్టర్‌’ వెబ్‌సిరీస్‌.. ట్రెండింగ్‌ టాప్‌ లో !

గతవారం స్ట్రీమింగ్‌ మొదలైన ‘ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌’ వెబ్‌సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ తెరకెక్కించిన ఈ వెబ్‌సిరీస్‌ గ్లోబల్‌ ట్రెండింగ్‌లో టాప్‌-10లోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.

భవ్‌ దులియా దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్‌లో పోలీస్‌ ఆఫీసర్‌ అమిత్‌ లోధాగా కరణ్‌ థాకర్‌ నటించారు. గ్యాంగ్‌స్టర్‌ అశోక్‌ మహతోగా అవినాష్‌ తివారి సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చారు. ఇక అభిమన్యుసింగ్‌, రవికిషన్‌, అషుతోష్‌ రాణాలు తమదైన నటనతో మెప్పించారు.