కేజీఎఫ్ నిర్మాణ సంస్థలో.. కీర్తి సురేష్ తిరుగుబాటు !

హోంబలే ఫిల్మ్స్ – ‘కేజీయఫ్’ పార్ట్ 1, 2 సినిమాలతో విశేష గుర్తింపు పొందిన సంస్థ. ఇప్పుడీ నిర్మాణ సంస్థలో మహానటి కీర్తి సురేష్ తిరుగుబాటు చేస్తోంది. అలాగని పర్సనల్ పోరాటం కాదు. ఈ సంస్థలో ఓ నాయికా ప్రాధాన్య సినిమా రాబోతుంది. దాని కోసం ప్రముఖ నటి కీర్తి సురేశ్ ను ఎంపిక చేశారు. తాజాగా టైటిల్‌ను ఖరారు చేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

అందులో ఓవైపు రైల్వే ట్రాక్, మరోవైపు గోడ, తాటిచెట్లు కనిపించాయి. ఈ రెండింటి మధ్య కీర్తి సురేశ్ లుక్‌ని తీర్చిదిద్దారు. చేయి పైకెత్తి, పిడికిలి బిగించి ఉన్నట్టు కనిపించింది కీర్తి. దీన్ని బట్టి చూస్తుంటే ఈ చిత్రం తిరుగుబాటు నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ‘రఘు తాత’ (Raghu Thatha) అనే పేరుతో రూపొందనున్న ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. విజయ్ కిరంగదూర్ నిర్మాత. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న తొలి తమిళ సినిమా ఇదే.