అగ్నితుఫాన్ వస్తోంది

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. తాజాగా ఈసినిమా కాన్సెప్ట్ పోస్టర్ విడుదలైంది. ఆ పోస్టర్‌ని డీ కోడ్ చేస్తే ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. They Call Him #OG.. ఇక్కడ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్. వాళ్లందరూ ఆయన్ని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని పిలుస్తుంటారని ఈ ట్యాగ్ లైన్ చెబుతోంది.

పోస్టర్‌లో పవన్‌కల్యాణ్ ఫొటోపై రాసి ఉన్న భాష.. జపానీస్. FirestormIsComing (అగ్నితుఫాన్ వస్తోంది) అని దాని అర్థం. పవన్‌కల్యాణ్ నీడలో గన్ కనిపిస్తుంది. పవన్‌కల్యాణ్ ముందు ఉన్న వృత్తాకారం.. జపాన్ జాతీయ జెండాను గుర్తు చేస్తుంది. పోస్టర్‌లో ఓ వైపు విగ్రహం ఆకారం కనిపిస్తుంది. అది జపాన్‌లోనే అత్యంత ఎత్తైన బుద్ధుడి విగ్రహం. ఇది ఆ దేశంలోని ఉషికు ప్రాంతంలో ఉంది.

ఇక, పోస్టర్‌లో మరోవైపు చూస్తే మనదేశంలోని గేట్‌వే ఆఫ్ ఇండియా కనిపిస్తుంది. పైన చెప్పిన వాటిని ఆధారంగా చూస్తే ఈ సినిమాలో పవర్‌స్టార్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారని అర్థమవుతోంది. జపాన్, ముంబయి నేపథ్యంలో ఈ కథ సాగే అవకాశం ఉందని తెలుస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపుదిద్దుకోనున్న ఈసినిమా కోసం సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ వెచ్చించే అవకాశం ఉందని సమాచారం.