#SMB28 దుబాయ్ లో మ్యూజిక్ సిట్టింగ్స్

త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న మహేష్ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే షురూ కానుంది. అయితే ఆ లోపుగానే సంగీత చర్చలకోసం చిత్రబృందం దుబాయ్‌ వెళ్లనుంది. సంగీత దర్శకుడు తమన్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ కలిసి కొన్నాళ్లపాటు దుబాయ్‌లో గడపనున్నట్టు సమాచారం.

త్రివిక్రమ్ సినిమా పూర్తి కాగానే రాజమౌళి తో మహేష్ సినిమా ఉండనుంది. వచ్చే జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలనే ప్లాన్ లో ఉన్నట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. అడ్వెంచర్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మహేష్ పర్ ఫెక్ట్ గా సరిపోతాడని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.