ఆర్యన్ ఖాన్ ప్రాజెక్ట్.. స్క్రిప్ట్ రెడీ !

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్యన్ ఖాన్ అతి త్వరలో తెరకు పరిచయం కాబోతున్నారు. ఓ వెబ్ సిరీస్ కు సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. స్వయంగా ఆర్యన్ ఖాన్ కథ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని తాజాగా ఇన్ స్టా వేదికగా ఆర్యన్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సిరీస్ కు ఆర్యన్ డైరెక్షన్ తో పాటు యాక్టింగ్ కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఆర్యన్ ఖాన్ ఇప్పటికే రెండు, మూడు సార్లు వార్తల్లో నిలిచారు. అమితాబ్ మనవరాలితో ఆర్యన్ ఎస్ ఎమ్ ఎస్ అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ముంబై నౌకలో డ్రగ్స్ లో జైలుకి వెళ్లొచ్చారు. అయితే తొలిసారి సినిమాలకు సంబంధించిన వార్తలతో ఆర్యన్ ఖాన్ ట్రెండింగ్ టాప్ లోకి రావడం విశేషం. దీనిపై ఆర్యన్ తల్లి గౌరీ ఖాన్ ఆనందం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టింది. అన్నట్టు.. ఈ వెబ్ సిరీస్ ను షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ నిర్మించనుంది.