సూపర్ స్టార్ కృష్ణ కు పార్లమెంట్ లో ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణకు పార్లమెంట్ ఉభయ సభలు నివాళులర్పించాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. జీ-20 సదస్సుకు సన్నద్ధం కావాలని చెప్పారు. రాజ్యసభ ఛైర్మన్‌గా తొలిసారి బాధ్యతలు నిర్వహిస్తున్న జగదీప్ ధన్‌ఖడ్‌కు దేశంతో పాటు సభ తరఫున ప్రధాని శుభాకాంక్షలు చెప్పారు.
అనంతరం ఇటీవల కన్నుమూసిన సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, ప్రముఖ తెలుగు నటుడు, మాజీ ఎంపీ ఘట్టమనేని కృష్ణకు రాజ్యసభలో నివాళులర్పించారు. అటు లోక్‌సభలోనూ వీరికి నివాళులర్పించిన అనంతరం దిగువసభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
ఇక ఈ సమావేశాలు ఈనెల 29 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 23 రోజుల వ్యవధిలో ఉభయ సభలు 17 దఫాలు భేటీకానున్నాయి. ఈ సమావేశాల్లో 16 కొత్త వాటితో సహా 25 బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండగా.. కీలకమైన మూడు బిల్లులను స్థాయీ సంఘం పరిశీలనకు పంపించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టనుంది.