కీలక వడ్డీరేట్లను పెంచిన ఆర్బీఐ
ఊహించినట్టుగానే ఈసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి చేరింది. సోమవారం ప్రారంభమైన ద్రవ్య పరపతి కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేడు ప్రకటించారు.
ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే సంకేతాలు కనిపించడం, ఆర్థిక వృద్ధి నెమ్మదించడంతో రేట్ల పెంపు వేగాన్ని ఈసారి ఆర్‌బీఐ కాస్త తగ్గించింది. తాజా పెంపుతో అన్ని రకాల రుణాలు మరింత భారం కానున్నాయి.
ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యంగా కేంద్ర బ్యాంకు రెపోరేటును ఇప్పటి వరకు ఈ ఏడాది 225 పాయింట్లు పెంచింది. దీంతో మే నెలలో 4.4 శాతంగా ఉన్న కీలక వడ్డీరేటు ఇప్పుడు 6.25 శాతానికి చేరింది. ఇక 2022-2023 ఆర్థిక సంవత్సర జీడీపీ అంచనాలను ఆర్‌బీఐ 7 శాతం నుంచి 6.8 శాతానికి కుదించింది. 2022 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో 4.4 శాతం, 2023 జనవరి- మార్చిలో 4.2 శాతంగా వృద్ధిరేటు నమోదు కావొచ్చని అంచనా వేసింది.