హిమాచల్‌లో హోరాహోరీ.. క్యాంపు రాజకీయాలు షురూ !
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం కొనసాగుతోంది. గుజరాత్ వార్ వన్ సైడ్ అయింది. మరోసారి భారీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇక హిమాచల్ ప్రదేశ్ లో హోరాహోరి పోరు సాగుతుంది హిమాచల్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 35 మంది సభ్యుల సంఖ్యా బలం అవసరం.
ప్రస్తుతం బీజేపీ 33 స్థానాల్లో, కాంగ్రెస్ 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మరో 3 స్థానాల్లో స్వతంత్రులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజస్థాన్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎమ్మెల్యేల తరలింపు బాధ్యతను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్, పార్టీ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాకు అప్పగించినట్లు తెలుస్తోంది.