గుజరాత్‌లో వార్ వన్ సైడ్.. మళ్లీ బీజేపీదే అధికారం !

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుజరాత్‌లో 182 స్థానాలకు గాను ఇప్పటివరకూ అధికార భాజపా 151 స్థానాల్లో, కాంగ్రెస్ (21), ఆప్ (6), ఇతరులు (5) స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. దీంతో వరుసగా ఏడో సారి గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.
ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. భాజపా 33 స్థానాల్లో, కాంగ్రెస్ 31, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఆప్ ఇంకా ఖాతా తెరవలేదు.