ఓడినా.. రోహిత్ హిట్
పసికూన బంగ్లాదేశ్ పై భారత్ ఓడింది. మూడు వన్డేల సిరీస్ ను 2-0తో సమర్పించుకుంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో 272 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక.. కేవలం 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
అయితే రోహిత్ శర్మ గాయాన్ని సైతం లెక్క చేయకుండా జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. చివరి వరకూ హిట్ మ్యాన్ చేసిన పోరాటం ఫలించకపోయినా.. రోహిత్ పోరాటాన్ని అభిమానులు కొనియాడుతున్నారు. ఐదు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 28 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఈ పరుగులు, లెక్కలు రోహిత్ కష్టానికి కొలమానం అస్సలు కాదు. ఎందుకంటే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. తన గాయాన్ని సైతం లెక్క చేయకుండా మైదానంలోకి దిగాడు. యువతకు అంకిత భావం అంటే ఏమిటి? జట్టు కోసం ఏం చేయాలి? అని ఏవైనా తరగతులు చెప్పాలనుకుంటే.. ఈ మ్యాచ్ చూపిస్తే సరి అన్నట్లుగా ఆడాడు.