ఆటోలోనే.. ఆ పని చేసిన శ్రియా

సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ పెళ్లై.. ఓ బిడ్డకు తల్లైనా ఏమాత్రం తగ్గడం లేదు. వరుస సినిమాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. పార్టీలు, ఫోటో షూట్స్ సర్వసాధారణం అంటోంది. ఇక మొగుడితో కలిసి బయట కనిపిస్తే.. కెమెరా ముందు పెదాలు జుర్రుకోవడం జరుగుతూనే ఉంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆటోలోనే.. ఆ పని కానిచ్చేసింది. అలాగని బూతు పనేం కాదు. గురువారం ఈ ముద్దుగుమ్మ ఆటోలో ముంబైలోని పనోరామ్ స్టూడియోకి వచ్చింది. అయితే దిగే సమయంలో.. ఆటోలో కూర్చొని ఫోటోలకు పోజులిచ్చింది. దిగిన తర్వాత కూడా ఆటో బ్యాక్ గ్రౌండ్ కనిపించేలా పోజులు కొట్టింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో క్యూట్ గా కనిపించింది శ్రియా. ఆమె నటించిన హిందీ దృశ్యం 2 ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి.. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. 

Cutie @shriya1109 ‘s fun auto ride ❤️😍 at #Panorama studios.#ShriyaSaran #Shriya #shriyasaranhot @ShriyaSaran_FC @shriya1109 https://t.co/5m8bdTbqen pic.twitter.com/2H7gayRlul— OTTRelease (@ott_release) December 8, 2022