ఆర్యన్ ఖాన్ హీరో కాదు.. రచయిత మాత్రమే !

హీరో కొడుకు హీరో కావాలనే రూల్ ఏమీ లేదు. ఎంటర్ టైనర్ రంగంలో తనకి అభిరుచి ఉన్న పని చేయొచ్చు. ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్  షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ అదే చేస్తున్నారు. ఆయన తొలి సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారు. దీనికి సంబంధించిన అప్ డేట్ ను మంగళవారం ఇచ్చిన సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ పూర్తయింది. 2023 లో మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది అని తెలిపారు.

అయితే ఈ సినిమా డైరెక్షన్ , హీరో కూడా ఆర్యన్ ఖాన్ నే అనే ప్రచారం జరుగుతుంది. కానీ అందులో నిజం లేదట. ఈ మేరకు షారుక్ క్లారిటీ ఇచ్చారు. ఆర్యన్ ఖాన్ కేవలం రచయితగానే ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇదిలా ఉంటే, షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ జోయా అక్తర్ యొక్క ది ‘ఆర్చీస్’ తో తొలిసారిగా నటిస్తోంది.