చీరకట్టులో బుజ్జమ్మ.. సూపరో సూపర్ !

మృణాళిని రవి లక్కీ హీరోయిన్. ‘సూపర్ డీలక్స్’ సినిమాతో తమిళ తెరకు పరిచయం అయింది. ఇందులో సపోర్టింగ్ రోల్ లో కనిపించింది. ‘గద్దలకొండ గణేష్ తో తెలుగు తెరకు పరిచయం అయింది. బుజ్జమ్మ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. గత ఏడాది ఎనిమి, ఎంజీఆర్ మగన్, జాంగో సినిమాల్లో నటించింది. ఈ ఏడాది ‘కోబ్రా’ సినిమాతో అలరించింది. ప్రస్తుతం మామ మశ్చింద్ర, ఆర్గానికి మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాల్లో నటిస్తోంది. ఈ ముద్దుగు సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్.

ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్ టేస్ట్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటోంది. చీరకట్టులో.. ట్రెండీ లుక్ లో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లైట్ కలర్ చీరలో అందంగా ముస్తాబైంది. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. మూడ్నాలుగు భంగిమల్లో రచ్చ చేసింది. ఇప్పుడీ.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.