‘పఠాన్’ షారుక్ సరికొత్త లుక్

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ – దీపికా పదుకొనె జంటగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కింది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. జనవరి 25న ‘పఠాన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసిన చిత్రబృందం రేపు ఫస్ట్ సాంగ్ #BesharamRang చేయబోతుంది. సాంగ్ రిలీజ్ కు ముందు దీపికా పదుకొనె రెండు బికినీ లను రిలీజ్ చేసిన చిత్రబృందం.. తాజాగా షారుఖ్ లుక్ సరికొత్త లుక్ ను రిలీజ్ చేసింది. ఇందులో షారుక్ సూపర్ స్మార్ట్ గా కనిపిస్తుండగా.. బికినీ పిక్స్ లో దీపికా సూపర్ హాట్ కనబడుతున్నారు.
