కరీంనగర్‌ గడ్డ.. భాజపా అడ్డా

కరీంనగర్‌ గడ్డ..భాజపా అడ్డా అన్నారు తెలంగాణ బీజేజీ చీఫ్ బండి సంజయ్. ఐదో విడత ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఏకమయ్యారని ఆయన ఆరోపించారు. కమీషన్లు దాచుకుందాం’ అన్న రీతిలో వారు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలు తిరస్కరిస్తే ‘జై తెలంగాణ అని నేనంటా.. జై ఆంధ్రా అని నువ్వను’ అంటూ ఇద్దరూ మాట్లాడుకున్నారని అన్నారు.

తెలంగాణ పేరుందని టీఆర్ఎస్ కు 2 సార్లు ఓట్లు వేశాం. భారాస పేరుతో ‘తెలంగాణ’ పదాన్ని తొలగించారు. ఇకపై తెరాసకు తెలంగాణతో సంబంధం లేదు. ఇప్పటికే తెలంగాణ తల్లికి కేసీఆర్‌ ద్రోహం చేశారు. భారాస పేరుతో కేసీఆర్‌ మరోసారి రాష్ట్రానికి మోసం చేస్తున్నారు. మద్యం పేరుతో దోచుకున్నారు. భూములు లాక్కున్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాత ఖాళీలైన ఉద్యోగాల్లోనూ నియామకాలు చేపట్టలేదు. నోటిఫికేషన్లు ఇస్తారు.. కోర్టుల్లో పిటిషన్లు వేస్తారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారు. కేసీఆర్‌కు మళ్లీ అధికారం ఇస్తే మరో రూ.5 లక్షల కోట్లు అప్పు చేస్తారు. ధరణీ పేరుతో ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ రగల్చాలని కేసీఆర్‌ చూస్తున్నారు.. ఆయనకు రాజకీయాలు తప్పితే.. ప్రజల సంక్షేమం పట్టదని సంజయ్ విమర్శించారు.