గ్యాప్ రాలేదు.. గ్యాప్ క్రియేట్ చేశారు !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – స్టార్ కమెడియన్ అలీ ఎందుకు విడిపోయారు. సినిమాల పరంగా ప్రాణ స్నేహితులు అనిపించుకున్న వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న పాలిటిక్స్ ఏంటీ ? గ్యాప్ ఎందుకు వచ్చింది ? దానికి కారణం ఎవరు ? అన్నది వచ్చే సోమవారం రాత్రి 9:30 నిమిషాల తర్వాత తేలనుంది. అవునూ.. ఇది నిజం.

అలి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఆలీతో సరదాగా’ 350 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వచ్చే వారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా ఆలీనే వచ్చారు. మరి ఆలీ అతిథిగా వస్తే, ఎవరు ఇంటర్వ్యూ చేశారనుకుంటున్నారా? యాంకర్‌ అనే పదానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన వన్‌ అండ్‌ ఓన్లీ సుమ. చాలా ఫన్నీగా సాగిన ఎపిసోడ్‌లో ‘పవన్‌ కల్యాణ్‌కు మీకూ మధ్య గ్యాప్‌ ఎందుకు వచ్చింది’ అని సుమ అడగ్గా, ‘గ్యాప్‌లేదు. గ్యాప్‌ క్రియేట్‌ చేశారు.’ అంటూ ఏం జరిగిందో చెప్పారు. అసలు విషయం తెలియాలంటే పూర్తి ఎపిసోడ్‌ చూడాలి.