ఐదేళ్ల తర్వాత పుష్ప 3
పుష్ప పార్ట్ 1 సూపర్ హిట్టయ్యింది. పార్ట్ 2పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన రెండో పుష్ప.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సుకుమార్ మైండ్ లో ఇప్పుడు పార్ట్ 3 ఐడియా కూడా పుట్టేసింది.
పార్ట్ 2 చివర్లో మూడో భాగానికి బీజం వేసేలా స్క్రిప్టు తయారు చేశాడట. పుష్ప తొలి భాగంలో ఓ కూలీ స్మగ్లర్ గా ఎలా ఎదిగాడో చూపించారు. పార్ట్ 2లో.. అతని ఉచ్ఛస్థితి, పతనం రెండూ చూపించబోతున్నార్ట. తను జీరోకి పడిపోయి.. మళ్లీ హీరోగా ఎదగడమే పార్ట్ 3 కథ అని తెలుస్తోంది. అయితే పుష్ప 3 ఇప్పుడే పట్టాలెక్కదు. అయితే అది పుష్ప 2 పూర్తయిన వెంటనే కాదట. దాదాపు నాలుగైదు ఏళ్ల తర్వాత మూడో పుష్పను తీసుకురావాలనే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తోంది.