స్వర్గం అంటే ‘పండోరా’
జేమ్స్ కామెరూన్ సృష్టించిన ‘అవతార్-ది వే ఆఫ్ వాటర్’పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. దేవుడు ఈ విశ్వాన్ని సృష్టిస్తే.. కామెరూన్ ‘పండోరా’ అనే అద్భుత ప్రపంచాన్ని క్రియేట్ చేశాడని అన్నారు. ‘అవతార్-2’లో అందమైన నీటి ప్రపంచాన్ని చూపించారు. అత్యద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే ప్రదర్శన.. ఊపిరి బిగబెట్టేలా యాక్షన్ సీన్లతో ఈ సినిమా సాగింది. దేవుడు ఈ భూమిని సృష్టిస్తే.. పండోరా అనే అందమైన ప్రపంచాన్ని జేమ్స్ కామెరూన్ క్రియేట్ చేశాడు. ఈ ప్రపంచంలో నివసించాలని ఉంది. ‘అవతార్-2’ చూసిన తర్వాత స్వర్గం అంటే ‘పండోరా’ వలే ఉంటుందని ఎవరైనా మాటిస్తే.. మనుషులందరూ చచ్చిపోతారు’’ అని వర్మ పేర్కొన్నారు
2009లో విడుదలైన ‘అవతార్’కు కొనసాగింపుగా కామెరూన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు సినీ ప్రముఖులు, ప్రియుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే రూ. 14 కోట్లు కలెక్ట్ చేసింది.