‘టాప్‌ గేర్‌’ ట్రైలర్‌ టాక్

ఆది సాయికుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘టాప్‌ గేర్‌’. రియా సుమన్‌ హీరోయిన్. కె.శశికాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కె.వి.శ్రీధర్‌రెడ్డి నిర్మాత. ఈ సినిమా డిసెంబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆదివారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. కథలోని పాత్రలందరూ డేవిడ్‌, అతడి ఆచూకీ గురించి అడుగుతూ కనిపించారు. మరి ఇంతకీ డేవిడ్‌ ఎవరు? హైదరాబాద్‌లో జరిగిన పలు హత్యలకు, డేవిడ్‌కూ సంబంధం ఏంటి? క్యాబ్‌ డ్రైవర్‌ అయిన ఆదిని ఎందుకు పోలీసులు వెంటాడారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ను కట్ చేశారు.