ఫిఫా ప్రపంచకప్‌ విజేత అర్జెంటీనా

ఫిఫా ప్రపంచకప్‌ విజేతగా అర్జెంటీనా నిలిచింది. ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన టైటిల్‌ పోరులో  పెనాల్టీ షూటౌట్‌లో ఆజట్టు నెగ్గింది. దీంతో మూడోసారి అర్జెంటీనా ఛాంపియన్‌గా అవతరించింది.

ఈ పోరులో తొలుత ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. దీంతో అదనపు సమయం కేటాయించారు. ఈ అదనపు సమయంలో ఇరు జట్లు చెరో గోల్‌ చేయడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. దీంతో పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా వరుసగా నాలుగు గోల్స్‌ చేయగా, ఫ్రాన్స్‌ 2 గోల్స్‌ చేసింది. ఈ విజయంతో అర్జెంటీనా జట్టు విశ్వవిజేతగా నిలిచింది.