ఇలాగే మొదలవుతుంది.. జాగ్రత్త !

కోలీవుడ్ నిర్మాత, రచయిత వైరాముత్తు విషయంలో యువ నటి అర్చనని అలర్ట్ చేసింది గాయని చిన్మయి. ఇటీవల తాను వైరాముత్తును కలిశానంటూ అర్చన ఫొటోలు షేర్ చేసింది.
వాటిపై చిన్మయి స్పందిస్తూ..‘‘ఇలాగే మొదలవుతుంది. దయచేసి అప్రమత్తంగా ఉండు. వీలైనంత వరకూ దూరం పెట్టు. అలాగే, నీ పక్కన వేరే వ్యక్తులు లేకుండా ఒక్కదానివే వెళ్లి ఆయనను ఎప్పటికీ కలవకు’’ అని సలహా ఇచ్చింది. గతంలో కోలీవుడ్ లో మీ టూ ఉద్యమాన్ని ప్రారంభించిన చిన్మయి.. వైరాముత్తు పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.