Oppenheimer ట్రైలర్ రివ్యూ

క్రిస్టోఫ‌ర్ నొల‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న హాలీవుడ్ చిత్రం ‘ఓపెన్‌హైమ‌ర్‌’. అట‌మిక్ బాంబ్ సృష్టిక‌ర్త ఓపెన్‌హైమ‌ర్‌ జీవితం ఆధారంగా తెర‌కెక్కుతోంది. ఓపెన్‌హైమ‌ర్‌ పాత్ర‌లో సిలియ‌న్ మ‌ర్ఫీ న‌టిస్తున్నాడు. 2023 జూలై 21న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ ను వదిలారు.

అణుబాంబు త‌యారీలో ఓపెన్‌హైమ‌ర్‌ ఎదుర్కొన్న సంఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కించిన‌ట్లుగా ట్రైల‌ర్ చూస్తే తెలుస్తోంది. దాదాపు వంద మిలియ‌న్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాలో రాబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్‌, మాట్ డామ‌న్‌, ర‌మీ మ‌లెక్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.