బీజేపీ-టీడీపీ లను కలిపే బాధ్యత తీసుకున్న పవన్ ?

పల్నాడు గడ్డ మీద నుంచి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవదు.. గెలవనివ్వం అని గట్టిగా చెబుతున్నారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ బాధ్యతను తాను తీసుకుంటా అంటున్నారు.
అదే సమయంలో వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వనని హామీ ఇస్తున్నారు. అవసరమైతే మరోసారి టీడీపీతో పొత్తుకు రెడీ అన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. అలాగని బీజేపీని దూరం పెట్టడం లేదు. ఆ పార్టీతో సంబంధాలు బాగానే కొనసాగిస్తునారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి ఏర్పాటుకు జనసేన లోలోపల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అందులో పవన్ సక్సెస్ అయితే ఏపీ పీఠాన్ని జగన్ కు దూరం చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు.