డిగ్గీరాజా రాక.. వెంకట్ రెడ్డిలో చిగురిస్తున్న ఆశలు !

ఇస్తే పీసీసీ పదవి ఇవ్వండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తా. లేదంటే నా దారి నేను చూస్కుంటా అన్నట్లుగా ఉంది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం. ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి పోయినప్పుడే వెంకట్ రెడ్డి ఆత్మ కూడా కమలం గూటికి చేరింది. ప్రస్తుతం ఆయన బాడీ మాత్రమే హస్తం పార్టీలో ఉంది. అతి త్వరలోనే ఆయన ఫిజికల్ గా కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు భోగట్టా. 

అయితే ఇంతలో కోమటిరెడ్డిలో ఆశలు చిగురించినట్లు కనబడుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల లో నెలకొన్న అసంతృప్తిని తొలగించడానికి హస్తం హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. ఆయనొచ్చి అందరితో మాట్లాడనున్నారు. అయితే ఢిగ్గీరాజాతో వెంకట్ రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన రేవంత్ రెడ్డిని తక్కువ చేసి.. తనని ఎక్కువ చేసి చూపిస్తారని ఆశపడుతున్నట్లు కనబడుతుంది. అదే జరిగితే.. తాను మళ్లీ పీసీసీ రేసులోకి దూసుకొస్తా. రేవంత్ కాకుండా మరెవ్వరు ? ప్రశ్నకు తానే సమాధానం అవుతానని భావిస్తున్నారని టాక్.