బాలయ్య మనోభావాలు దెబ్బ తిన్నాయా ?

బాలయ్య మనోభావాలు దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నాయి. అందుకే హీరోయిన్ శృతి హాసన్ మా బావ మనోభావాలు అంటూ కొత్త పాట ఏసుకోబోతుంది. వీరిద్దరు జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్ అప్ డేట్ వచ్చేసింది.  #MaaBavaManobhavalu సాంగ్ ను ఈ నెల 24న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు అప్ డేట్ ఇస్తూ.. మైత్రీ మూవీస్ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. చుట్టూ భామలతో బాలయ్య స్టయిలీష్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాకు  థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.