ఎయిమ్స్‌లో చేరిన నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆమె ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆస్పత్రిలో చేరారా? అస్వస్థతతో చేరారా? అన్నది స్పష్టత రాలేదు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.